కర్నూలు జిల్లాలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఇప్పటి వరకూ జిల్లాలో ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు వచ్చిందని.. మరో 351 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 429 మంది నమూనాలు సేకరించామని... 77 మందికి కరోనా నెగెటివ్ వచ్చినట్లు కలెక్టర్ వీరపాండ్యన్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 15 క్వారంటైన్ కేంద్రాల్లో.. 574 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. కర్నూలులో లాక్డౌన్ పరిస్థితిపై మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు.
కర్నూలులో లాక్డౌన్.. ఖాళీగా రహదారులు
కరోనా నేపథ్యంలో కర్నూలు జిల్లాలో లాక్డౌన్ పటిష్టంగా కొనసాగుతోంది. ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకే కేసు నమోదైందని.. మరో 351 మంది నమూనాలు ఫలితాలు రావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 15 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కర్నూలులో లాక్డౌన్.. ఖాళీగా రహదారులు