అనవసరంగా బయటకు వచ్చారు... గుంజీలు తీశారు
కర్నూలు జిల్లా బేతంచర్లలో లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించి బయట తిరుగుతున్న యువకులతో పోలీసులు గుంజీలు తీయించారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 14వ తేదీ వరకు దేశమంతా లాక్డౌన్ విధించినప్పటికీ... కొందరు ఆకతాయిలు రహదారులపై తిరగ్గా పోలీసులు ఈ శిక్ష విధించారు. అనవసరంగా బయటకు రామని చెప్పిన తర్వాతనే ఆ యువకులను పంపించారు.