ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ప్రభావం​తో పెరుగుతున్న ధరలు - నందికొట్కూరు రైతు బజార్ తాజా న్యూస్

కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతోంది. రోడ్లపైకి వచ్చిన ప్రజలను పోలీసులు తిప్పి పంపిస్తున్నారు. మరోవైపు.. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి.

కరోనా ఎఫెక్ట్​... పెరుగుతున్న ధరలు
కరోనా ఎఫెక్ట్​... పెరుగుతున్న ధరలు

By

Published : Mar 24, 2020, 7:52 AM IST

కరోనా ఎఫెక్ట్​... పెరుగుతున్న ధరలు

కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్​డౌన్​ వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు లాక్​డౌన్​ పాటించని కారణంగా రహదారులు రద్దీగా మారాయి. పోలీసుల జోక్యంతో దుకాణాలు మూసివేశారు. రైతు బజార్​కి వచ్చే ప్రజలు చేతులు శుభ్రం చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్​ యార్డు బోసిపోయింది. ఆర్టీసీ బస్సులను నిలిపివేసిన కారణంగా.. బస్టాండ్​ నిర్మానుష్యంగా మారింది. పట్టణంలో ఉన్న 108 బస్సులు డిపోలకే పరమతమయ్యాయి.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

బనగానపల్లెలో లాక్​డౌన్​ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిపివేశారు. ప్రజలు ప్రధాన వీధులు దినసరి మార్కెట్లలో నిత్యవసర వస్తువుల కోసం దుకాణాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది వ్యాపారస్తులు అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ధరలు తగ్గించే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అధిక ధరలకు అమ్ముతున్నారు

నందికొట్కూరులోని రైతు బజార్​లలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉగాదిని పురస్కరించుకొని కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పట్టణానికి చేరుకున్నారు. గత వారం కంటే ఈవారం కూరగాయల ధరలు భారీగా పెరిగాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసుల హెచ్చరికలు

ABOUT THE AUTHOR

...view details