కర్నూలు జిల్లా ఆదోనిలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ లాక్ డౌన్ ప్రకటించారు. ఆదోనిలో ఇప్పటి వరకు 497 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 20మంది చనిపోయారు. చాలా కాలనీలు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి. నిత్యావసరాల కోసం ఉదయం 6 గంటలు నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే సడలింపులిచ్చారు. అనవసరంగా బయటకు వచ్చే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఆదోనిలో మళ్లీ లాక్ డౌన్..! - corona news in adoni
కర్నూలు జిల్లా ఆదోనిలో జిల్లా కలెక్టర్ లాక్ డౌన్ విధించారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టణంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడినవారి సంఖ్య 497కు చేరింది.

lockdown in adoni at kurnool dst