కర్నూలు జిల్లా మహనంది ఆలయంలో ఓ కూరగాయల వ్యాపారి పూజలు నిర్వహించారనే విషయం చర్చనీయాంశంగా మారింది. లాక్ డౌన్ అమలులో ఉన్న క్రమంలో ఆ వ్యాపారిని ఎందుకు అనుమతించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓ పాత్రికేయుడు ఆ వ్యాపారి వెంట పూజల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
లాక్డౌన్ ఉల్లంఘన... ఆలయంలో పూజలు? - లాక్డౌన్ ఉల్లంఘన...ఆలయంలో పూజలు !
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కర్నూలు జిల్లా మహనంది ఆలయంలో ఓ కూరగాయల వ్యాపారి పూజలు నిర్వహించారనే ఆరోపణ.. చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అధికారులు విచారణ చేపట్టారు.
లాక్డౌన్ ఉల్లంఘన...ఆలయంలో పూజలు !
ఈ విషయంపై ఆలయ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయటం లేదని గుర్తించారు. నంద్యాలకు చెందిన ఆ వ్యాపారి ఆలయ అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు విరాళంగా ఇస్తుంటారని సమాచారం.