కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నందున పోలీసులు లాక్‌డౌన్ కార్యక్రమాన్ని కట్టుదిట్టం చేశారు. ఉదయం కూడా ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. నగరంలో ఎక్కడా కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయలేదు. వీధుల్లోకి.. ఇంటికి ముందు కూరగాయల బండి వచ్చినప్పుడు మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప నేరుగా తనిఖీల్లో పాల్గొని.... అనవసరంగా బయట తిరుగుతున్న రాయలసీమ వర్సిటీ విద్యార్థుల బైక్‌లను స్వాధీనే చేసుకున్నారు. ఇవాళ్టి నుంచి అనవసరంగా బయటకు వచ్చినవారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.
లాక్డౌన్ను కట్టుదిట్టం చేసిన పోలీసులు - కర్నూలులో లాక్‌డౌన్ వార్తలు
కర్నూలు నగరంలో లాక్డౌన్ను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉదయం నుంచీ రాకపోకలు జరగకుండా చర్యలు చేపట్టారు. వీధుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే కూరగాయలు కొనాలని సూచిస్తున్నారు. అనవసరంగా బయటతిరుగుతున్న వర్సిటీ విద్యార్థుల బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
kurnool