కర్నూలు జిల్లా నంద్యాలలో లాక్డౌన్ కొనసాగుతోంది. పెరుగుతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా విభజించి కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని పోలీసులు సూచిస్తున్నారు.
లాక్డౌన్లో బయటికొచ్చాడు.. పోలీసులు అవాక్కయ్యేలా జవాబు చెప్పాడు!
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్డౌన్ అమల్లో ఉన్నా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా బయటికి వస్తున్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి బయటికి వచ్చాడు. ఎందుకని అడగ్గా అతను చెప్పిన సమాధానానికి పోలీసులు అవాక్కయ్యారు.
lock down in kurnool district
కొందరు ఏదో కారణం చెప్పి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో సైకిల్ పై బయటకు వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకుని ప్రశ్నించారు. అతను నవరత్న ఆయిల్ కోసం అని చెప్పగా... అవాక్కయ్యారు. హెచ్చరించి పంపించేశారు.
ఇవీచదవండి:భారత్లో 548 మంది వైద్య సిబ్బందికి కరోనా