కర్నూలు జిల్లా నంద్యాలలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవ్వటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. నంద్యాలలో నేటి నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ఆర్డీవో రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరుచేందుకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. అత్యవసల సేవలకు మినహాయింపు ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రజలంతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనాను నిర్మూలించేందుకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ కోరారు.
నంద్యాలలో మరోసారి లాక్డౌన్.. నేటి నుంచే అమల్లోకి - నంద్యాలలో మరోసారి లాక్డౌన్
నేటి నుంచి కర్నూలు జిల్లా నంద్యాలలో లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనాను అరికట్టేందుకు ప్రజలంతా సహకరించాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ కోరారు.
నంద్యాలలో మరోసారి లాక్డౌన్