కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని మద్యం దుకాణాల వద్ద మద్యం ప్రియులు బారులు తీరారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విక్రయాలు కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో.... మద్యం ప్రియులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఉదయం నుంచే దుకాణాల వద్ద బారులు తీరారు. పోలీసులను లెక్క చేయకుండా.... భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులు నిలుచున్నారు.
కరోనాను మరిచారు...మందు కోసం క్యూ కట్టారు..! - కర్నూలు వార్తలు
తాగాలనే తపన ముందు వారికి కరోనా భయం కనిపించడం లేదు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు కట్టుకోవడం లాంటి నిబంధనలు పక్కనబెట్టి.... మండుటెండను సైతం లెక్కచేయకుండా మద్యం కోసం ఎగబడిన ఘటన నందికొట్కూరులో జరిగింది.
నందికొట్కూరులో మద్యం కోసం మందుబాబులు బారులు