Liquor bottles at RTC Cargo Parcel Center: కర్నూలు ఆర్టీసీ కార్గో పార్సిల్ కేంద్రంలో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. పార్సిల్ కేంద్రానికి ఓ బరువైన సంచి వచ్చింది. దాన్ని దింపే క్రమంలో మద్యం వాసన వస్తున్నట్లు హమాలీలు గుర్తించారు. అందులో పగిలిపోయిన రెండు మద్యం సీసాలతో పాటు మరో 10 సీసాలు ఉండటాన్ని చూసి సిబ్బంది అవాక్కయ్యారు. సమాచారం అందుకున్న సెబ్ అధికారులు విచారణ చేపట్టారు. పార్సిల్ చిరునామాలో ఉన్న పత్తికొండకు చెందిన రవిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అక్రమ మద్యాన్ని ఎప్పటినుంచి ఇలా తీసుకొస్తున్నారు.. ఎవరెవరికి చేరుతుందనే విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నట్లు పత్తికొండ సెబ్ అధికారులు తెలిపారు.
ఆర్టీసీ కార్గో పార్సిల్ ద్వారా మద్యం సరఫరా.. చివరకు చిక్కాడిలా - ఆర్టీసీ పార్సిల్ ద్వారా అక్రమ మద్యం
Liquor Bottles at RTC Cargo Parcel Center: ఆర్టీసీ కార్గో పార్సిల్ ద్వారా మద్యాన్ని తరలించాలి అనుకున్నాడు. తీరా రెండు సీసాలు పగలడంతో.. అధికారులకు చిక్కాడు. దీంతో అతడిని రిమాండ్కు తరలించి.. విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన కర్నూలు ఆర్టీసీ కార్గో పార్సిల్ కేంద్రంలో చోటు చేసుకుంది.
మద్యం సీసాలు