కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. కర్ణాటక నుంచి కంకర ట్రాక్టర్లో తరలిస్తున్న 96 బాక్సుల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో.. కర్ణాటక - ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదోని మండలం గజ్జెహళ్లి క్రాస్ దగ్గర ట్రాక్టర్లో ఎటువంటి అనుమానం రాకుండా కంకర రాళ్ల మధ్యలో మద్యాన్ని దాచి పెట్టారు.
పోలీసులు అనుమానం వచ్చి ట్రాక్టర్ను సోదా చేయగా.. 96 బాక్సుల్లో 9216 టెట్రా ప్యాకెట్లలో మద్యం తరలించడాన్ని గుర్తించారు. వీటి విలువ 3 లక్షల 27 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు గోనెగండ్ల మండలానికి చెందిన వారని ఎక్సైజ్ సీఐ రమేశ్ రెడ్డి తెలిపారు.