ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బేతంచర్లలో పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ - lions club services in bethamcherla in kurnool

కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తోన్న పారిశుద్ధ్య సిబ్బందికి సహాయం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. కర్నూలు జిల్లాలో లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో వారికి నిత్యావసరాలు అందించారు.

బేతంచర్లలో పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ
బేతంచర్లలో పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ

By

Published : Apr 13, 2020, 12:51 PM IST

కరోనా నేపథ్యంలో కర్నూలు జిల్లా బేతంచెర్లలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పారిశుద్ద కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం నిరంతరం శ్రమిస్తోన్న సిబ్బందికి ఎస్సై సురేష్ చేతులమీదుగా బియ్యం, చక్కెర, గోధుమపిండి, ఉప్పు, కారం వంటి 10 రకాల వస్తువులు అందజేశారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

జిల్లాలోని బేతంచర్లలో ఒక కరోనా కేసు నమోదు కావడం వల్ల ఈ ప్రాంతాన్ని అధికారులు ఆరెంజ్​ జోన్​గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన దాదాపు 100 కుటుంబాలకు.. లయన్స్​ క్లబ్​ సభ్యులు నిత్యావసరాలు అందజేశారు.

ఇదీ చూడండి

కరోనా: రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లు అంటే ఏమిటీ..?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details