కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం జరిగింది. నంద్యాల ఎస్బీఐ కాలనీకి చెందిన మునిస్వామి లైన్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా విద్యుత్ నియంత్రికకు ఫ్యూజ్ వేస్తుండగా షాక్తో మృతి చెందాడు. ప్రాణం ఉందని భావించిన కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రికి తరలించగా... మునిస్వామి ఘటనా స్థలంలోనే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
విద్యుదాఘాతంతో లైన్మెన్ మృతి - కర్నూలు జిల్లా క్రైం
విద్యుదాఘాతంతో లైన్మెన్ మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. విద్యుత్ నియంత్రికకు ఫ్యూజ్ పెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

విద్యుద్ఘాతంతో లైన్మెన్ మృతి