కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని దద్దనాల ప్రాజెక్టులో పూర్తి స్థాయికి నీటిమట్టం చేరుకుంది. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గేట్లను ఎత్తివేసి జుర్రేరువాగుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ కు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ఎమ్మెల్యే. చెరువుల అభివృద్ధికి సుమారు 12 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు మంజూరు అయిన వెంటనే చెరువు అభివృద్ధి పనులు చేయిస్తామన్నారు. దద్దనాల ప్రాజెక్ట్ గురించి ముఖ్యమంత్రికి వివరించామని హంద్రీనీవా కాలువ నుంచి సాగునీటి మళ్ళించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
దద్దనాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత - Lifting of daddanala project gates
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని దద్దనాల ప్రాజెక్టులో పూర్తి స్థాయికి నీటిమట్టం చేరుకుంది. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గేట్లను ఎత్తివేసి జుర్రేరువాగుకు నీటిని విడుదల చేశారు.

దద్దనాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
వాగు నీరు విడుదల కావడంతో కింద భాగాన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతుల కోసం సీఎం నిరంతరం పని చేస్తున్నారని కొనియాడారు.
ఇవీ చదవండి: చెరువుకు గండి.. వృథాగా పోతున్న నీరు