మూక దాడులను అరికట్టాలని ప్రధానికి లేఖ రాసిన వారిపై కేసు నమోదు చేయటం సరికాదని సీపీఎం నాయకులు అన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ వర్గాల వారిపై దాడులు ఎక్కువవుతున్నాయని ఆరోపించారు. వివిధ రంగాలకు చెందిన 49 మంది జాతీయ ప్రముఖులు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారని... దేశ ద్రోహం కేసు నమోదు చేయడం దారుణమని వాపోయారు. వీరిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మూకదాడులను అరికట్టాలని ప్రధానికి లేఖ రాయటం దేశ ద్రోహమా? - సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యలయం ఎదుట నిరసన
కర్నూలు జిల్లాలో మూక దాడులను అరికట్టాలని ప్రధానికి లేఖ రాసిన వారిపై కేసులు నమోదు చేయటం సరికాదని సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
![మూకదాడులను అరికట్టాలని ప్రధానికి లేఖ రాయటం దేశ ద్రోహమా?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4678920-266-4678920-1570441875237.jpg)
మూకదాడులను అరికట్టాలని ప్రధానికి లేఖ రాయటం దేశ ద్రోహమా?
మూకదాడులను అరికట్టాలని ప్రధానికి లేఖ రాయటం దేశ ద్రోహమా?
ఇదీ చదవండి:భాజపా అధ్యక్షుడు సహా నేతల భిక్షాటన...