కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు భక్తుల నుంచి పెద్దగా స్పందన లేకపోవటం గమనార్హం. కరోనా నేపథ్యంలో భక్తుల సందడి తక్కువగానే ఉంది. భక్తులు నదిలోకి దిగకుండా జాలీలు ఏర్పాటు చేశారు. జల్లు స్నానాలు చేసేందుకు మాత్రమే అవకాశం కల్పించారు.
పిండప్రదానాలు, పూజాది కార్యక్రమాల అనంతరం... జల్లు స్నానాలు చేసి భక్తులు వెనుదిరుగుతున్నారు. రాంబొట్ల దేవాలయం ఘాట్, నాగసాయిబాబా ఘాట్, నగరేశ్వరం ఘాట్, రాఘవేంద్ర మఠం ఘాట్, సాయిబాబా ఘాట్లలో భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. సంకల్ బాగా ఘాట్ వద్ద భక్తుల సందడి కనిపిస్తోంది.