ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో చిరుతపులి కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు - కర్నూలు జిల్లాలో చిరుత దాడిలో గొర్రెలు మృతి

Leopard wandering in kurnool district : కర్నూలు జిల్లా బల్లేకల్ గ్రామంలో చిరుతపులి కలకలం రేపింది. చిరుత సంచారంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో గొర్రెల మందపై దాడి చేసి నాలుగు గొర్రెలను చంపేసిందని యజమాని తెలిపారు. చిరుతపులి సంచారంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదన్నారు.

Leopard
Leopard

By

Published : Feb 22, 2022, 12:56 PM IST

Leopard wandering in kurnool district : కర్నూలు జిల్లా ఆదోని మండలం బల్లేకల్ గ్రామంలో చిరుతపులి కలకలం రేపుతోంది. చిరుత సంచారంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో చిరుతపులి దాడిలో నాలుగు గొర్రెలు మృతి చెందాయని గొర్రెల యజమాని తాయప్ప తెలిపారు.

నిన్న రాత్రి సమయంలో చిన్నగా శబ్దం రావడంతో వెళ్లి చూడగా... గొర్రెలపై చిరుతపులి దాడి చేస్తూ కనిపించిందని.. చిరుతను తరిమేందుకు ప్రయత్నించగా తనపైన దాడి చేయటానికి యత్నించిందన్నారు. వెంటనే ఇంట్లోకి పరిగెత్తి తల దాచుకున్నానని తాయప్ప తెలిపారు. చిరుతపులి సంచారంపై అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని... అయినప్పటికీ ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. చిరుత నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details