ఆదోని మండలం కుప్పగల్లు గ్రామ కొండల్లో చిరుత పులుల సంచారం స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రెండు చిరుత పులులను స్థానికంగా ఉన్న కొండపై చూసిన మూగజీవాలు అరుపులు మెుదలు పెట్టాయి. దీంతో పొలం పనులు చేసుకుంటున్న రైతులు వెంటనే తేరుకొని అక్కడ నుంచి పరుగు తీశారు. గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. పొలం పనులకు వెళ్లాలంటే భయమేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులుల బారి నుంచి రక్షించాలంటూ.. అధికారులను వేడుకుంటున్నారు.
ఆదోనిలో కలకలం రేపుతున్న చిరుతల సంచారం - కుప్పగల్లు గ్రామ కొండల్లో చిరుత పులుల సంచారం
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు గ్రామ కొండల్లో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. రెండు చిరుతలు స్థానిక కొండపై కనిపించటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆదోనిలో కలకలం రేపుతున్న చిరుతల సంచారం