ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అహోబిలం రోడ్డుపై దర్జాగా కూర్చొన్న చిరుత! - రహదారిపై చిరుత

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ-అహోబిలం రహదారిలో సోమవారం రాత్రి చిరుత సంచరించింది. దుర్గమ్మ గుడి వద్ద తెలుగుగంగ కాల్వ వంతెన దాటగానే ఉన్న రహదారిపై అడ్డంగా కూర్చొంది.

రహదారిపై చిరుత బైఠాయింపు !
రహదారిపై చిరుత బైఠాయింపు !

By

Published : Jun 9, 2020, 7:20 AM IST

Updated : Jun 9, 2020, 10:34 AM IST

అహోబిలం రహదారిపై చిరుత బైఠాయించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. సోమవారం రాత్రి అహోబిలం సమీపంలోని దుర్గమ్మ గుడి వద్ద ప్రధాన రహదారిపై చిరుత బైఠాయించింది. దీంతో రెండు వైపులా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చాలాసేపు అలాగే ఉండిపోయిన చిరుత... తర్వాత తాపీగా అటవీ ప్రాంతంలోకి వెళ్లి పోయింది. ఈ ప్రాంతం చుట్టూ నల్లమల అటవీ ప్రాంతం ఉండటంతో తరచూ అటవీ జంతువులు బయటికువచ్చి అహోబిలం దేవస్థానం సమీపంలో తిరుగుతుంటాయి.

అహోబిలం రహదారిపై అడ్డంగా కూర్చొన్న చిరుత!
Last Updated : Jun 9, 2020, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details