కర్నూలు జిల్లా డోన్ మండలం ఓబుళాపురం గ్రామ సమీపంలో కనుమ కింద కొండ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోంది. సీసంగుంతల గ్రామానికి చెందిన మేకను పులి చంపేసింది. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించగా... వారు వెళ్లి పరిశీలించగా పులి జాడలు కనిపించాయి. అక్కడ ఆడపులి ఉందని దానికి మూడు పిల్లలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. సిశంగుంతల గ్రామంలో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొండల్లో పరిశీలించిన అటవీశాఖ అధికారులు, కొండల్లోకి వెళ్లొద్దంటూ గ్రామాల్లో దండోరా వేయించారు. గ్రామస్థులంతా అప్రమత్తంగా ఉండాలని ఫారెస్టు అధికారులు తెలిపారు.
అనగనగా ఓబుళాపురం.. అక్కడ చిరుతపులి..దానికి మూడు పిల్లలు!
కర్నూలు జిల్లా డోన్ మండలం సీసంగుంతల, ఓబుళాపురం కొండల్లో చిరుతపులి సంచారం చేస్తోందని అధికారులు గుర్తించారు. ఓ మేకను చంపిందని...గ్రామస్థులందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ పోలీసులు సూచించారు
చిరుతపులి.