కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని అల్వాలలో అప్పుల బాధ తట్టుకోలేక ఓ కౌలు రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు వేయగా వర్షానికి దెబ్బనడంతో పాటు నాలుగు లక్షల రూపాయల అప్పు మిగిలింది. దీంతో మనోవేదనకు గురైన తిమ్మప్ప (30) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
అప్పల బాధతో కౌలురైతు ఆత్మహత్య - farmer suicide news update
అకాల వర్షాలకు పంట నష్టపోయి అప్పులు మాత్రమే మిగిలిన ఓ కౌలు రైతు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
అప్పల బాధతో కౌలురైతు ఆత్మహత్య