కర్నూలు జిల్లా గూడూరు మండలం మునగాల గ్రామంలో కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బోయ వెంకటేశ్వర్లు (45) అనే కౌలు రైతు.. క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సొంత పొలంతోపాటుగా.. మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఈ క్రమంలో ఐదు లక్షల వరకు అప్పు చేసి సాగు చేశారు. పంటలు సరిగా రాక అప్పులు మిగిలాయి. అప్పులు ఎలా తీర్చాలన్న బాధతో.. ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అప్పుల బాధతో.. కౌలు రైతు ఆత్మహత్య - ఈరోజు కర్నూలులో కౌలు రైతు ఆత్మహత్య వార్తలు
అప్పుల బాధ తాళలేక కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా మునగాల గ్రామంలో జరిగింది. అప్పు చేసి సాగు చేస్తే.. పంటలు సరిగా పండకపోవటంతో.. నష్టాలు మిగిలాయి. దీంతో రైతు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.
కౌలు రైతు ఆత్మహత్య