కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారం క్షేత్రంలో అర్చకుల సంఘం నాయకులు ఆందోళన చేశారు. మృగపాణి అనే అర్చకుడి పై ఆలయ చైర్మన్ పిట్టం ప్రతాపరెడ్డి దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈవో కార్యాలయాన్ని ముట్టడించి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆలయంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనటంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం అధికారులు, అర్చకుల తో సమావేశం నిర్వహించారు. పూజారుల డిమాండ్లను తెలుసుకొని...పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఓంకార క్షేత్రంలో అర్చకుల సంఘం ఆందోళన - కర్నూలు ఓంకారం క్షేత్రం తాజా వార్తలు
కర్నూలు జిల్లాలోని ఓంకారం క్షేత్రంలో అర్చకుల సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. అక్కడి అర్చకుడి పై ఆలయ చైర్మన్ దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు.
ఓంకార క్షేత్రంలో అర్చకుల ఆందోళన