రాయలసీమలో రాజధాని, హైకోర్టు విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్నూలులో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా మాట్లాడి... రాయలసీమ ప్రజలను అవమానించారని ఆయన దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల కూడలి నుంచి కేసీ కాలువ వరకు ఊరేగింపు నిర్వహించి అక్కడే దిష్టిబొమ్మను నిమజ్జనం చేశారు. పవన్ కల్యాణ్ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయ వాదులు ఉద్యమానికి మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు.
రాజధాని,హైకోర్టుపై పవన్ వ్యాఖ్యలకు నిరసనగా న్యాయవాదుల ధర్నా - కర్నూలులో న్యాయవాదుల ఆందోళనలు
రాజధానిని పులివెందులలో, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా మాట్లాడి... రాయలసీమ ప్రజలను అవమానించారని ఆయన దిష్టిబొమ్మకు కర్నూలులో న్యాయవాదులు శవయాత్ర నిర్వహించారు.
రాజధాని,హైకోర్టుపై పవన్ వ్యాఖ్యాలకు... కర్నూల్లో న్యాయవాదుల ధర్నా