ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మీకోదండం మాకొద్దు మేడం'- భూరక్ష పథకం అమలు కోసం అధికారుల తంటాలు - భూముల రీసర్వే

Land Resurvey in AP: కళ్లెదుటే భూమి ఉంది.! రైతులు దశాబ్దాలుగా దాన్నే సాగుచేసుకుంటున్నారు.! కానీ రికార్డులో వారి భూమి విస్తీర్ణం కంటే తగ్గిపోతోంది. ఉన్న ఆస్తి కళ్ల ముందే కరిగిపోతున్నట్లవుతోంది.! రైతుల కాళ్ల కింది నేల కదిలిపోతున్నట్లవుతోంది.!

Land_Resurvey_in_AP
Land_Resurvey_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2024, 7:38 AM IST

Land Resurvey in AP: భూ వివాదాల పరిష్కారం కోసమంటూ జగన్‌ సర్కారు తెచ్చిన భూముల రీసర్వే కొత్త వివాదాలు సృష్టిస్తోంది. రైతులకు వారి భూములపై శాశ్వత హక్కులు కలగడం దేవుడెరుగు ఉన్న హక్కుల్నే హరించివేస్తోంది. కొన్ని గ్రామాలో రీసర్వేను బహిష్కరిస్తున్న రైతులు ప్రభుత్వం ఇచ్చే పాస్‌ పుస్తకాలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇదీ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు కోసం అధికారుల తంటాలు.

'ఇది మీ మంచికోసమే'నని కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీవో రామలక్ష్మి నచ్చజెప్తుంటే 'మీకోదండం మాకొద్దు మేడం' అంటూ హాలహర్వి మండలం బిలేహాల్ గ్రామస్థులు వ్యతిరేకించారు. రీ సర్వేకు అంగీకరిస్తే పోయేదేముంది అంటారా.? కచ్చితంగా పోతుంది.! రికార్డుల్లో భూమి విస్తీర్ణం తగ్గిపోతోంది. ఒకట్రెండు సెంట్లుకాదు కొందరికి ఏకంగా 30, 40 సెంట్ల వరకూ తేడా వచ్చింది. అందుకే రైతులు ఇది 'జగనన్న భూరక్ష కాదు భూ భక్ష' అంటూ రోడ్డెక్కుతున్నారు. కడుపు మండి అధికారులు వేసిన రీసర్వే రాళ్లు పీకి పారేస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డిసెంబరు-2020లో భూముల రీసర్వే ప్రారంభించి ప్రయోగాత్మకంగా పందిపాడు, కాత్రికి, బిల్లలాపురం గ్రామాల్లో చేపట్టారు. తర్వాత మొదటి విడత 67 గ్రామాల్లో పూర్తి చేశారు. చాలా మందికి తేడాలు వచ్చాయి. కొన్ని గ్రామాల్లో రైతుల సర్వే నంబర్లే మాయం చేస్తున్నారు. తప్పులతడకలంటూ కర్నూలు జిల్లా చిరుమాన్ దొడ్డి రైతులు ఆస్పరి మండల కేంద్రంలో మూడు రోజులు ధర్నా చేశారు.

Jagananna Bhu Raksha Program:లోపభూయిష్టంగా జగనన్న భూరక్ష కార్యక్రమం..రీ సర్వేలో తలెత్తిన వివాదాలు

కర్నూలు జిల్లాల మద్దికెర మండలంలోని హంప గ్రామంలో భూ సర్వే పెద్ద భూకంపమే సృష్టించింది. ఈ ఊళ్లో 500 మంది రైతులుంటే ఏకంగా 230 మందికి చెందిన భూముల్ని తక్కువగా చూపారని ఆక్రోశిస్తున్నారు. ఇన్నాళ్లూ కలిసిమెలిసి ఉన్న గ్రామస్థుల మధ్య భూముల రీసర్వే వల్ల గొడవలు వస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. మళ్లీ రాళ్లు పాతేందుకు వస్తే ఊరుకునేది లేదని అధికారులకు తేల్చిచెప్పారు.

సత్యసాయి జిల్లా మడకశిర మండలం కల్లమర్రి రైతులైతే ఏకంగా భూరక్ష పాసు పుస్తకాలు తగలబెట్టేశారు. రైతులకు అంతలా కడుపు మండింది. కచ్చితత్వం కోసమే ఎవరైనా సర్వే చేస్తారు.! మరి అలాంటి ప్రక్రియ ఎక్కడ తేడాకొట్టింది. ఇక్కడ సిబ్బంది తీరే సందేహాస్పదంగా మారింది. భూమి రీసర్వేకు వస్తున్నట్లు అధికారులు రైతుకు తెలియజేయాలి, యజమాని సమక్షంలోనే కొలవాలి, అభ్యంతరాలుంటే పరిగణనలోకి తీసుకోవాలి.

గందరగోళంగా సాగుతున్న భూముల రీసర్వే

కానీ అధికారులు రైతుకు సమాచారం ఇవ్వకుండా, వారు లేనప్పుడు పొలాల్లోకి వెళ్తున్నారు. హడావుడిగా సర్వే చేసి హద్దురాళ్లు పాతి వెళ్లిపోతున్నారు. అందులో కచ్చితత్వంలేక రైతులు హతాశులవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న భూమి కంటే తక్కువ విస్తీర్ణాన్ని రికార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే "సర్వే కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోండి, వీలైనప్పుడు వచ్చి కొలుస్తాం" అంటూ చేతులు దులుపుకుంటున్నారు. అందుకే భూముల రీసర్వే అస్తవ్యస్తంగా మారింది.

రోజూ వంద ఎకరాల విస్తీర్ణంలో రీసర్వే చేయాలని ఒక్కో సర్వే బృందానికి ఉన్నతాధికారులు లక్ష్యం విధించి ఒత్తిడి పెంచుతున్నారు. అంతమంది రైతుల్ని ఒకేరోజు పిలిచి సర్వే పూర్తిచేయడం సాధ్యం కాకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యం చేసేస్తున్నారు. పొలాల్లో ఉండాల్సిన రైతుల్ని రోడ్డెక్కేలా చేస్తున్నారు. భూముల రీసర్వే గురించి గొప్పగా చెప్పుకునే జగన్‌ మాత్రం పుస్తకం లోపలున్న రికార్డులు ఎలా ఉంటే నాకేంటి పైన తన బొమ్మ స్పష్టంగా ముద్రిస్తే చాలనే తీరుగా ఉన్నారు.

Irregularities in Jagananna Bhu Hakku- Bhu Raksha Scheme: తప్పుల తడకగా జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం రీసర్వే.. సర్వేలో ఏకంగా నాలుగు ఎకరాలు మాయం

ABOUT THE AUTHOR

...view details