కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులు పాకలను అధికారులు తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఆర్డీవో బాలగణేశయ్య, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి వాటిని తొలగిస్తుండగా.. లబ్ధిదారులు వారిని అడ్డుకున్నారు. ఇన్నాళ్లు కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించనందున ఇళ్లు నిర్మించుకోలేదన్నారు. కొందరు పాకలు వేసుకుంటే వాటిని బలవంతంగా తొలగించడం తగదన్నారు.
ఎమ్మిగనూరులో పాకలు తొలగిస్తుండగా లబ్ధిదారుల అడ్డగింత - ఎమ్మిగనూరులో లబ్ధిదారుల పాకల తొలగింపు వార్తలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఇళ్లస్థలాల్లో లబ్ధిదారుల పాకలను తొలగిస్తుండగా స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. కాలనీలో కనీస సౌకర్యాలు లేనందున ఇళ్లు నిర్మించుకోలేదని.. ప్రస్తుతం తాము వేసుకున్న వాటిని తొలిగించడం తగదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మిగనూరులో పాకలు తొలగిస్తుండగా లబ్ధిదారుల అడ్డగింత
TAGGED:
ఎమ్మిగనూరు వార్తలు