మహానంది పుణ్యక్షేత్రంలో కార్తిక మాసం సందర్భంగా రోజూ ప్రధాన ఆలయం ఎదుట మహాధ్వజ స్తంభంపై నున్న మేఖలం వరకు దీపాన్ని చేరవేసి తెల్లవారేవరకు వెలిగించడం ఆనవాయితీ. ఈ దీపానికి పూజలు చేసి రోజూ సాయంత్రం 6 గంటలకు ధ్వజానికి కడతారు. సోమవారం రాత్రి ఆకాశ దీపం ధ్వజస్తంభంపై నుంచి కోనేరు(పుష్కరిణి)లో పడిపోయింది. సిబ్బంది కోనేట్లో దిగి దీపాన్ని బయటకు తీశారు. అనంతరం క్షమాపణ పూజలు చేపట్టారు.
కార్తిక వేడుకల్లో అపశ్రుతి.. మహానంది కోనేటిలో పడిన ఆకాశదీపం
మహానంది పుణ్యక్షేత్రంలో నిర్వహించిన కార్తిక వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ధ్వజస్తంభంపై నుంచి ఆకాశదీపం కోనేరులో పడిపోయింది.
కార్తిక వేడుకల్లో అపశ్రుతి.. మహానంది కోనేటిలో పడిన ఆకాశ దీపం