అహోబిలంలో లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా పండితులు.. వేదమంత్రోచ్ఛరణల నడుమ ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. ఈ ఉత్సవాలలో స్వామివారు ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాల్లో వివిధ అలంకరణలు, వాహన సేవల్లో భక్తులను అలరించనున్నారు. అలాగే ప్రత్యేక వాహనాల్లో స్వామికి వాహన సేవలు నిర్వహించనున్నారు. దిగువ అహోబిలంలో అంకురార్పణ కార్యక్రమంతో ఈ రోజు సాయంత్రం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ మహాదేశికన్ ఈ ప్రాంతాన్ని చేరుకున్నారు.
వైభవంగా అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు - ahobilam lakshmi narasimha swami latest news
కర్నూలు జిల్లా అహోబిలంలో వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణతో.. ఈ ఉత్సవాలను ఆరంభించారు.
అట్టహాసంగా అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు