శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శివునికి ప్రీతికరమైన సోమవారం సందర్భందా.. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, లక్ష దీపోత్సవం నిర్వహించారు.
ఆలయ పుష్కరిణి వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దేవస్థానం అర్చకులు నవ విధ హారతులు సమర్పించారు. పుష్కరిణికి సైతం హారతులు ఇచ్చారు. లక్ష దీపోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కార్తీక దీపారాధన చేశారు.