కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా కార్యకర్తలు కొందరు.. తెదేపాలో చేరారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి దంపతుల సమక్షంలో... దేవనకొండ మండలం, మాదాపురం గ్రామానికి చెందిన 18 కుటుంబాలు తెదేపా కండువాలు వేసుకున్నాయి. సుమారు 50 మంది వైకాపా నేతలు తెదేపాలో చేరారు. వైకాపా నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఉండగా.. ఇక్కడ మాత్రం నేతలు తెదేపా గూటికి చేరడం.. చర్చనీయాంశమైంది.
తెదేపా గూటికి వైకాపా కార్యకర్తలు - కర్నూలు వార్తలు
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైకాపా కార్యకర్తలు జగన్ జన్మదిన వేడుకలు చేసుకున్న సమయంలో.. కర్నూలు జిల్లాలో సీన్ రివర్స్ అయ్యింది. అధికార పార్టీకి చెందిన నేతలు తెదేపాలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేవనకొండ మండలం, మాదాపురం గ్రామానికి చెందిన 18 కుటుంబాలు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ గూటికి చేరాయి.
kurnool-ysrcp-activists-who-joined-tdp