కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినా వైకాపా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. కర్నూలులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన...22 మంది ఎంపీలు ఇచ్చిన ప్రజలకు వైకాపా ఏం చేసిందో చెప్పాలన్నారు. ఎన్నిసార్లు అడిగైనా ప్రత్యేక హోదా తెస్తామన్న వైకాపా అధినేత జగన్... కేంద్ర బడ్జెట్లో ఏం తెచ్చారన్నారు. కేంద్రం తీరుపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అమరావతి, పోలవరం పూర్తి కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్న సోమిశెట్టి...తెదేపా లక్ష్యంగా దాడులు మానుకోవాలని హితవుపలికారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చిరు ఉద్యోగులపై దాడులు చేయడం సబబు కాదన్నారు. బడ్జెట్ చూస్తే....రాష్ట్రంపై భాజపా కక్ష సాధిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. కనీసం మంత్రాయలం రైల్వే లైన్‌కు నిధులు కేటాయించలేదని ఆరోపించారు.
'22 మంది ఎంపీలను గెలిపిస్తే...బడ్జెట్లో తెచ్చిందేమిటి' - somisetty questions ycp
రహస్య ఒప్పందాలతో పని చేస్తున్న వైకాపా, భాజపాలు రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఏం తెచ్చాయే చెప్పాలని కర్నూలు తెదేపా నేత సోమిశెట్టి డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా మేలుకొని కేంద్రంపై పోరాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టాలన్నారు.

తెదేపా నేత సోమిశెట్టి