ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ సీఎం అయ్యాకే కరవు పెరిగింది: సోమిశెట్టి - సోమిశెట్టి వెంకటేశ్వర్లు

జగన్ వస్తేనే వర్షాలు కురుస్తాయని ప్రచారం చేసిన వైకాపా నేతలు.. రాష్ట్రంలో కరవు పరిస్థితులకు సమాధానం చెప్పాలని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ కోటాను వైద్య విద్యా, ఇంజినీరింగ్ కోర్సులకు అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి కోరారు.

జగన్ సీఎం అయ్యాకే కరవు పరిస్థితులు పెరిగాయ్ : సోమిశెట్టి

By

Published : Jul 17, 2019, 4:35 AM IST

జగన్ సీఎం అయ్యాకే కరవు పరిస్థితులు పెరిగాయ్ : సోమిశెట్టి

రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు... తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు. చంద్రబాబు అధికారంలో ఉంటే వర్షాలు రావనే అసత్య ప్రచారాలు చేసిన వైకాపా... జగన్ వస్తేనే వర్షాలు కురుస్తాయని ప్రచారం చేసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు కరవుకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాకే..రాష్ట్రంలో కరువు పరిస్థితులు మరింత పెరిగాయన్నారు. మాజీ శాసనసభ్యురాలు గౌరు చరితా రెడ్డితో కలిసి సోమిశెట్టి కర్నూలులో మీడియాతో మాట్లాడారు. ఇసుక సమస్య వల్ల భవన నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. ఎంతో మంది కూలీలు జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ శాసనసభ్యురాలు గౌరు చరితా రెడ్డి

కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణపేదల 10 శాతం రిజర్వేషన్ కోటాను వైద్య విద్య, ఇంజనీరింగ్ కోర్సులకు వర్తింప చేయాలని గౌరు చరితా రెడ్డి కోరారు. విత్తనాలు లేక రైతులు ఆందోళనలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు.

ఇదీ చదవండి : ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తోంది: తెదేపా

ABOUT THE AUTHOR

...view details