తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా కర్నూలు నగరంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. తెదేపా జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా చేసేందుకే ఇలాంటి చర్యలకు దిగారని ధ్వజమెత్తారు.
అచ్చెన్నాయుడి అరెస్టును వ్యతిరేకిస్తూ.. తెదేపా నేతల నిరసన - కర్నూలు తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వార్తలు
మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్నూలులో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరసన తెలిపిన తెదేపా నేతలు... ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
అచ్చెన్నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ తెదేపా నేతల నిరసన