కర్నూలు జిల్లా నంద్యాలలో తెదేపా పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల సమావేశం నిర్వహించారు. నంద్యాల తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... మాజీ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, గౌరు చరిత, తెదేపా నాయకులు శివానంద రెడ్డి, కే ఈ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కాకుండా మరో చోట వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించి, న్యాయం చేయాలని తీర్మానించినట్లు గౌరు వెంకటరెడ్డి తెలిపారు.