ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంద రోజుల వైకాపా ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్: సోమిశెట్టి

వైకాపా వంద రోజుల పాలనపై కర్నూలు జిల్లా తెదేపా నేతలు విమర్శలు చేశారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఆర్భాటంగా ప్రకటించిన నవరత్నాలు సంగతేంటని ప్రశ్నించారు. తెదేపా పథకాలను రద్దు చేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదన్నారు.

వందరోజుల వైకాపా ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్: సోమిశెట్టి

By

Published : Sep 7, 2019, 7:55 PM IST

వందరోజుల వైకాపా ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్: సోమిశెట్టి
వైకాపా వంద రోజుల పరిపాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని కర్నూలు తెదేపా నాయకులు ఆరోపించారు. కర్నూలు తెదేపా కార్యాలయంలో మాట్లాడిన తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి జగన్ అమలు చేయలేదన్నారు. నగరంలో తాగునీటి, ఇసుక సమస్య, తెదేపా నాయకులపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయన్నారు. తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేయడం తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. వచ్చేనెలలో తెదేపా అధినేత చంద్రబాబు జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా తెదేపా ఇన్​ఛార్జ్ టీజీ.భరత్ మాట్లాడుతూ.. వంద రోజుల పరిపాలనపై వందమందిని ప్రశ్నిస్తే ప్రభుత్వ నిజస్వరూపం తెలుస్తుందని పేర్కొన్నారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details