విజయవాడ దుర్గ గుడిలో ఏసీబీ దాడుల వివరాలు బయటపెట్టాలని కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'దుర్గ గుడిలో ఏసీబీ దాడుల వివరాలు బయటపెట్టాలి' - vijayawada kanaka durga temple acb attacks
దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తెదేపా మండిపడింది. దుర్గ గుడిలో ఏసీబీ దాడుల వివరాలు బయటపెట్టాలని కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
సోమిశెట్టి వెంకటేశ్వర్లు
ఇంత వరకు ఆలయాలపై విచారణ జరపలేదని... ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గ గుడి వ్యవహారం ఆ శాఖా మంత్రి వెల్లంపల్లికి తెలియకుండా జరగదని.. వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని కోరారు. ఇటీవల దుర్గగుడిలో 18 నుంచి 20వ తేదీ వరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఇదీ చూడండి.దుర్గగుడిలో అక్రమార్కులపై వేటు.. 15మంది ఉద్యోగుల సస్పెన్షన్