ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కర్నూలులో రాజధాని.. హైకోర్టు ఏర్పాటు చేయండి'

రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు కలెక్టరేట్​ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థులు గేటు ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్​ చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

కర్నూలు కలెక్టరేట్ ​ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు

By

Published : Oct 26, 2019, 6:03 PM IST

కర్నూలు కలెక్టరేట్ ​ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు

శ్రీభాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమకు న్యాయం చెయ్యాలని విద్యార్థి సంఘాలు కర్నూలు​ కలెక్టరేట్​ను ముట్టడించాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాయలసీమలో ఉన్న పెండింగ్​ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం విద్యార్థులు గేటు ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్​ చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.

45వ రోజుకు చేరుకున్న రిలే నిరాాహార దీక్షలు

శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 45వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు విషయంలో నిర్ణయం తీసుకోవాలని న్యాయవాదులు కోరారు.

ఇదీ చూడండి: 'రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయండి'

ABOUT THE AUTHOR

...view details