దశాబ్దాలుగా.. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు.. అద్భుత నటన, చక్కని పద్యాలు, సంభాషణలతో ఆకట్టుకుంటున్నారు. 1998లో అప్పటి ప్రభుత్వం నంది నాటక పరిషత్తును ఏర్పాటు చేసి.. మొట్టమొదటి నంది నాటకోత్సవాలను హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించింది. ఈ పోటీల్లో పాల్గొన్న కర్నూలు కళాకారులు మొదటి ప్రయత్నంలోనే నరనారాయణ నాటకానికి.. 5 నంది అవార్డులు సాధించారు. నాటి నుంచి నేటి వరకు మొత్తం 37 నంది అవార్డులు సాధించి ఆకట్టుకుంటున్నారు.
పద్యనాటకాలే కాదు సాంఘిక నాటకాల్లోనూ ప్రతిభ చాటుతున్నారు ఈ రంగస్థల నటులు. నంది నాటకోత్సవాల్లో.. పులిస్వారీ, మాధవ ప్రస్థానం, మహారథి కర్ణ, కృష్ణాభిమన్యు, ఓ మనిషీ నీకు జోహార్లు, ప్రమీలార్జున పరిణయం, కర్ణార్జునీయం, సైరా నరసింహారెడ్డి, బభ్రువాహనం, మబ్బుల్లో బొమ్మ వంటి నాటకాలకు నందులు వరించాయి. 2017, 2018, 2019 సంవత్సరాల్లో వరుసగా ఎన్టీఆర్ కళాపరిషత్ నాటక పోటీల్లోనూ సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి తమ కళాపోషణతో మెప్పిస్తున్నారు.
పద్య నాటకంలో రాణిస్తున్న కర్నూలు రంగస్థల కళాకారులు - కర్నూలు జిల్లా వార్తలు
పద్యం తెలుగువారి ఆస్తి. కంచు కంఠంతో ఆలపించే.. జానపద, పౌరాణిక పద్యాలకు.. కంప్యూటర్ యుగంలోనూ ఏ మాత్రం వన్నె తగ్గలేదు. రాయలసీమ జిల్లాల్లో పద్యనాటకానికి మంచి ఆదరణ ఉంది. ఆ పద్యనాటకమే కర్నూలు ఖ్యాతిని.. జాతీయ స్థాయి వరకు తీసుకువెళ్లింది. రాష్ట్రంలోనే అత్యధిక నంది అవార్డులు సాధించిన జిల్లాగా కర్నూలు ఖ్యాతి గడించింది.
kurnool
కరోనా కారణంగా.. ప్రదర్శనల్లేక.. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు కళాకారులు చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:దేవినేని ఉమ అరెస్టు.. గొల్లపూడిలో టెన్షన్ టెన్షన్