ఆలయాలపై పోలీసులు గట్టి నిఘా ఉంచాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. ఆయన శుక్రవారం అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో సీసీ కెమెరాలు, లైటింగ్ తదితర భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత సిబ్బంది, రాత్రి పూట లైటింగ్ నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అన్ని రకాల ప్రార్థనా మందిరాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలన్నారు.
సీసీ కెమెరాలు పని చేసేవిలా దేవస్థాన కమిటీలకు నోటీసులు అందజేయాలని పోలీసులకు సూచించారు. అనుమానితులు తారసపడితే భక్తులు, ప్రజలు 100కు డయల్ చేయాలన్నారు. ఆలయాలు, మసీదులు, ప్రార్థనా మందిరాల భద్రతకు గ్రామ పెద్దలు, కమిటీల నిర్వాహకులకు తగిన సూచనలు, సలహాలు చేయాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజేంద్ర, సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఆలయ మేనేజర్ వైకుంఠన్ పాల్గొన్నారు.