కర్నూలులో కరోనా నియంత్రణకు కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. జిల్లాలో కోవిడ్ రెండో వేవ్ ప్రభావం ఎక్కువగా ఉందని.. రోజుకు 2 వేలకు పైగా కేసులు నమెదు అవడమే కాక.. సగటున రోజుకు నలుగురు మరణిస్తున్నారని చెప్పారు.
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ప్రజలు బయటకు వచ్చి పనులు చుసుకోవాలని తెలిపారు. 12 గంటలు దాటిన తర్వాత అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.