ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతి సంబరాల్లో ఎస్పీ.. ఆటలతో అలరింత - కర్నూల్​ పోలీసులు తాజా సమాచారం

కర్నూలు జిల్లాలో.. ఐపీఎస్ అధికారి ఆకె.రవికృష్ణ దత్తత గ్రామం కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఫ్యాక్షన్ గ్రామంగా పేరొందిన ఈ ఊరిలో జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సంక్రాంతిని ఉత్సాహంగా జరుపుకొన్నారు. గ్రామంలోని యువకులతో కలిసి ఆటలాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఎస్పీ రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

kurnool sp fakeerappa participated sankranthi celebrations
సంక్రాంతి సంబురాల్లో జిల్లా ఎస్పీ

By

Published : Jan 14, 2021, 8:36 PM IST

సంక్రాంతి సంబురాల్లో జిల్లా ఎస్పీ

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామంగా పేరొందిన కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్, మ్యూజిక్ ఛైర్​ తదితర క్రీడలు నిర్వహించారు. ఎస్పీ సైతం ఆటలాడి అందరినీ ఆకట్టుకున్నారు. గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

ముందుగా ఎస్పీకి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఊరంతా ఒక దగ్గర చేరి ఆటలు, సాంప్రదాయ పద్ధతులలో పండుగ నిర్వహించారు. ఐపీఎస్ అధికారి ఆకె.రవికృష్ణ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోగా.. ఎస్పీ స్వయంగా ఇక్కడ వేడుకలకు హాజరయ్యారు. గ్రామంలోని క్రీడాకారులను, యువకులను అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details