Police Mobile Recovery Mela : కర్నూలు జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2కోట్ల రూపాయల విలువగల ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పొగొట్టకున్న సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించేందుకు.. కర్నూలు పోలీసులు మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతునే ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇప్పటి వరకు పోలీసులు స్వాధీన చేసుకున్నవాటి విలువ సుమారు 2 కోట్ల 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. దాదాపు 1042 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే తమ సెల్ఫోన్లు పొగొట్టుకున్నవారు కర్నూలు పోలీసు వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తే రికవరీ చేసి ఇస్తామని తెలిపారు. దేశంలో వివిద ప్రాంతాలలో పొగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసి అందించినట్లు వెల్లడించారు. రాజస్థాన్లో పోయిన ఫోన్ కేరళలో పట్టుకున్నామని అన్నారు. విశాఖ, కృష్ణా, అనంతపురం తదితర ప్రాంతాలకు చెందిన బాధితుల ఫోన్లను ఇప్పటివరకు రికవరీ చేసినట్లు వెల్లడించారు.