అక్రమంగా మద్యం తరలింపు, నాటుసారా తయారీ కేంద్రాలపై కర్నూలు పోలీసులు దాడులు కొనసాగుతున్నాయి. నగరంలోని బంగారు పేటలోని సారా తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో 3 వేల లీటర్ల బెల్లం ఊట, 140 లీటర్ల నాటుసారా, 200 కేజీల బెల్లాన్ని పోలీసులు ధ్వంసం చేసినట్లు రెండో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
కర్నూలులో సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు - kurnool district latest news
నాటుసారా తయారీ స్థావరాలపై కర్నూలు పోలీసులు దాడులు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని సీఐ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
3 వేల లీటర్ల ఊట బెల్లం లభ్యం