కర్నూలు జిల్లా నందికొట్కూరు పోలీసులు కరోనా నివారణకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, యమభటుల వేషధారణలో వచ్చి ప్రచారం నిర్వహించారు. యముడు భూలోకంలో సంచరిస్తున్నాడు... ప్రజలంతా ఇళ్లకే పరిమితమై తమ ప్రాణాలు కాపాడుకోవాలని... ప్రధాన రహదారులపై ప్రచారం చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తే మృత్యువు తప్పదని హెచ్చరించారు.
కాటికి వెళ్తారా... ఇళ్లల్లో ఉంటారా...??
కరోనా వ్యాప్తి నివారణపై కర్నూలు జిల్లాలో పోలీసులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణాలో వచ్చి... ప్రజలంతా ప్రాణాలు కాపాడుకోవాలని ప్రచారం చేశారు.
కరోనాపై వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్న కర్నూలు పోలీసులు