కర్నూలు జిల్లా ఆలయాల్లో చోరీలు సహా మరో ఇంటిలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. వెల్దుర్తి, గోనెగండ్ల, హాలహర్వి మండలాల్లోని 6 ఆలయాల్లో దోపిడీకి పాల్పడిన ఏడుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి లక్షా 4 వేల నగదు, 70 గ్రాముల పంచలోహ విగ్రహాలు, 80 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
గూడూరులో ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో దొంగను అరెస్టు చేసి.. 16 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసులను ఛేదించిన పోలీసులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.