కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై ఈ నెల 5న దోపిడీ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఉపయోగించిన స్విఫ్ట్ కారు, చోరీ చేసిన 3 చరవాణులు, రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నారు.
5వ తేదీ రాత్రి 12.30 గంటలకు వెల్దుర్తి జాతీయ రహదారిపై సూదేపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ కారును, స్విఫ్ట్ కారులో ఏడుగురు వ్యక్తులు వెంబడించారు. సూదేపల్లి స్టేజ్ వద్దకు రాగానే ముందున్న కారును ప్లాన్ ప్రకారం స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. ముందు కారులోని వ్యక్తులు దిగి, ప్రశ్నిస్తుండగా.. దుండగులు వారిపై దాడి చేసి రూ.10 వేల నగదు, 3 చరవాణులు అపహరించారు.