ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూగర్భ మురుగునీటి వ్యవస్థ లేదు... సమస్యల తీరవు!

తమను గెలిపిస్తే... అభివృద్ధి తథ్యమని హామీలిస్తారు. ఎన్నికలయి గద్దెనెక్కాక మొహం చాటేయడం నాయకులకు.... వీరింతే అని అనుకోవడం ప్రజలకూ పరిపాటే...! ఒకప్పటి ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలులోనూ ఇదే దుస్థితి. ఎందరో రాజకీయ పెద్దలున్న ఈ నగరంలో... ఇన్నేళ్లైనా భూగర్భ మురుగునీటి వ్యవస్థ లేకపోవడమే అందుకు తార్కాణం.

By

Published : Mar 3, 2021, 7:10 AM IST

Kurnool
కర్నూలు నగరవాసుల ఇక్కట్లు

భూగర్భ మురుగునీటి వ్యవస్థ లేదు... సమస్యల తీరవు!

కర్నూలు నగరపాలకసంస్థ పరిధిలో 52 వార్డులు ఉన్నాయి. సుమారు 6 లక్షలా 50 వేల జనాభా. ఒకప్పుడు.. ఆంధ్రుల రాజధానిగా వెలుగొందింది. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో ఒకటైన కర్నూల్లో.. ఇప్పటికీ సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడం ఇక్కడివారికి ఇబ్బందిగా మారింది. వర్షమొస్తే మురుగునీరు రోడ్లపై ప్రవహించడమే కాక.. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మిగతా రోజుల్లోనూ సరైన పారిశుద్ధ్య చర్యలు లేక కాల్వల్లో వ్యర్థాలు పేరుకుపోయి.. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.

పందుల బెడదా తప్పట్లేదు. వీటి వల్ల జబ్బులు బారిన పడుతున్నామని నగరవాసులు వాపోతున్నారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని గతంలో ప్రభుత్వాలు హామీ ఇచ్చినా.. ఇప్పటిదాకా చేసిందేమీ లేదని స్థానికులు మండిపడుతున్నారు. భూగర్భ మురుగనీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని నిట్టూరుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళనైనా తమ సమస్య తీరుతుందేమోనన్న ఆశతో కర్నూలు వాసులు ఎదురుచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details