పాణ్యంలో జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ప్రచారం చేశారు. మండలంలోని గోనవరం, ఆలమూరు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఎంపీగా తాను చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. జనసేనతోనే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని... పవన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి.