కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం సిమెంట్ నగర్‌కు చెందిన యువకుడు కువైట్‌లో గుండెపోటుతో మరణించాడు. గ్రామానికి చెందిన రామకృష్ణ గత రెండు సంవత్సరాలుగా కువైట్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అనారోగ్యంగా ఉండటంతో ఉదయం ఆసుపత్రికి బయల్దేరాడు. అకస్మాత్తుగా రోడ్డుపై కుప్పకూలగా..అక్కడే ఉన్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు నిర్థరించారు. దింతో గ్రామంలో విషాద ఛాయులు అలుముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేలా చొరవ చూపాలని మృతుని బంధువులు కోరుతున్నారు.
గుండెపోటుతో కువైట్‌లో కర్నూలు వాసి మృతి - Kurnool native died in Kuwait due to heart attack
కర్నూలుకు చెందిన యువకుడు కువైట్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. లాక్డౌన్ నేపథ్యంలో మృతదేహాన్ని ఎలాగైనా స్వస్థలం తీసుకొచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొవాలని మృతుని బంధువులు కోరుతున్నారు.
కువైట్‌లో మృతిచెందిన కర్నూలు వాసి