కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని స్థానికంగా ఉన్న గాంధీ చౌక్‌లో నిరసన చేపట్టారు. ఘటనకు కారకులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
'అబ్దుల్ కుటుంబం ఆత్మహత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలి' - గాంధీ చౌక్‌లో నిరసన
కర్నూలు జిల్లా నంద్యాలలో ముస్లిం ప్రజా సంఘాలు అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీని ఏర్పాటు చేశాయి. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు